తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వక్రబుద్ధి: కరోనా వేళా.. కాల్పులకు తెగబడిన పాక్ - india pakistan news

దాయాది పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధిని చాటింది. వరుసగా మూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌ రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలే లక్ష్యంగా కాల్పులు జరిపింది. పాక్ దాడిని భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి.

Pakistan Army shells forward areas along LoC in J-K's Rajouri
భారత్​ లక్ష్యంగా కాల్పులకు తెగబడిన పాక్

By

Published : Apr 1, 2020, 8:01 PM IST

కరోనాతో భారత్​ యుద్ధం చేస్తోన్న వేళ పాక్​ మరోసారి తన దుర్నీతిని చాటింది. జమ్ముకశ్మీర్​లో​ వరుసగా మూడోరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలే​ లక్ష్యంగా దాడికి తెగబడింది. కాల్పులు, మోర్టార్​ షెల్​లను ప్రయోగించింది. అయితే పాక్ దాడిని భారత సేనలు దీటుగా తిప్పికొట్టాయి.

గత రెండు రోజులు కూడా భారత్​పై దాడికి దిగింది దాయాది సైన్యం. బాలాకోట్​, పూంఛ్, మన్​కోట్ సెక్టార్లు లక్ష్యంగా కాల్పులు చేసింది. భారత్​-పాక్​ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట ఈ ఏడాదిలో​ 646 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. 2019లో 3200 సార్లు పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది.

ఇదీ చదవండి:'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'

ABOUT THE AUTHOR

...view details