గుజరాత్ తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత్కు చెందిన మూడు బోట్లను సీజ్ చేశారు.
18 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన పాక్ - భారత మస్తయకారులను అరెస్టు చేసిన పాక్
అరేబీయా సముద్రంలో తమ సరిహద్దులోకి ప్రవేశించారనే ఆరోపణలతో 18 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు బోట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఖచ్ జిల్లా.. జకూ కోస్ట్ దగ్గర అరేబీయా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్మాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవన్ జుంగీ తెలిపారు. పాక్ సరిహద్దులోకి ప్రవేశించినందుకే వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 18 మంది భారత మత్స్యకారులను, మూడు బోట్లను 5వ తేదీన కరాచీ పోర్ట్కు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 15న చేపలు పట్టే కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత మత్స్యకారులను పట్టుకోవడం ఇదే తొలి సారని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:'ఐపీసీ, సీఆర్పీసీల సవరణకు సూచనలివ్వండి'