తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ సైన్యం దాడుల్లో ఇద్దరు భారతీయ జవాన్లు మృతి - two soldiers, civilian killed in Kupwara

భారత సేనలు లక్ష్యంగా మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లా టాంఘర్​ సెక్టార్​ వద్ద జరిగిన ఈ దాడిలో ఇద్దరు సైనికులు, ఓ సాధారణ పౌరుడు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఆస్తినష్టం జరిగింది.

భారత్​ లక్ష్యంగా పాక్ కాల్పులు-ముగ్గురి మృతి

By

Published : Oct 20, 2019, 10:01 AM IST

Updated : Oct 20, 2019, 10:52 AM IST

సరిహద్దు వెంట మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించింది దాయాది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్​ కుప్వారా జిల్లా టాంఘర్​ సెక్టార్​లో భారత బలగాలే లక్ష్యంగా పాక్ సేనలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

భారత్​లోకి చొరబాటుదారులను పంపడమే లక్ష్యంగా దాయాది ఈ కాల్పులు జరిపిందని తెలుస్తోంది. పాక్​ దాడిలో ఓ ఇల్లు, రైస్​మిల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 19 ఎద్దులు, గొర్రెలు ఉన్న రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి.

పొరుగు దేశం​ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్థాన్​కూ తీవ్రస్థాయిలో నష్టం కలిగించినట్లు భారత సైన్యం ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన

Last Updated : Oct 20, 2019, 10:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details