తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో ఆగని పాకిస్థాన్​​ దుశ్చర్య - indian army

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని మూడు సెక్టార్లలో నియంత్రణరేఖ వెంబడి మోర్టార్​ షెల్స్​తో దాడులకు పాల్పడింది. అయితే భారత బలగాలు దీటుగా ఎదుర్కొన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

Pak violates ceasefire in three sectors of J-K's Poonch and Rajouri
మరోసారి పాక్​ దూకుడికి కళ్లెం

By

Published : Oct 11, 2020, 10:11 PM IST

Updated : Oct 11, 2020, 10:48 PM IST

పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని దేగ్వార్​, ఖారీ కర్మారా సెక్టార్లలో మోర్టార్​ షెల్స్​ని ప్రయోగించింది. పాక్​ చర్యకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

సరిహద్దులో ఆగని పాకిస్థాన్​​ దుశ్చర్య

ఆదివారం సాయంత్రం 6:15 సమయంలో దేగ్వార్​ సెక్టార్​లో, 6:40కు ఖారీ కర్మారా సెక్టార్​లో, 6:45కి సుందర్​బన్​ సెక్టార్​లో దాడులకు పాల్పడింది.

మరోవైపు మేఢర్​ సెక్టార్​లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

ఈ నెలలోనే పాకిస్థాన్ 62సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘింది. 2020లో మొత్తం 3,589సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

ఇదీ చదపండి :ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

Last Updated : Oct 11, 2020, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details