పాక్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు.
పాక్ ఆకస్మిక దాడులకు భారత సరిహద్దు రక్షణ దళాలు దీటుగా బదులిచ్చాయి. హీరానగర్, చక్ర గ్రామంలో తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన కాల్పులు సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగాయి. పాకిస్థాన్ రేంజర్లు డజన్ల కొద్ది ఫిరంగులతో దాడి చేశారని తెలిపారు అధికారులు.