తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చిన భారత్​

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ, మెంధర్​, క్రిష్ణ ఘాటి, పూంచ్ సెక్టార్​లలో పాక్ బలగాలు నిన్న అర్ధరాత్రి నుంచి దాడులకు తెగబడ్డట్లు అధికారులు తెలిపారు.  ఈ చర్యలకు భారత బలగాలు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు.

Pak violates ceasefire
పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చిన భారత్​

By

Published : Dec 22, 2019, 1:28 PM IST

సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్​ మరోసారి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​లో రాజౌరీలోని నౌశహర సెక్టార్​ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ బలగాలు దాడులకు తెగబడ్డట్లు అధికారులు తెలిపారు. మోర్టార్ ​షెల్స్​ను విసిరినట్లు చెప్పారు. పాక్ చర్యలకు భారత బలగాలు దీటుగా బదులిచ్చాయన్నారు.

నిన్న రాత్రి నుంచి కశ్మీర్​లోని మెంధర్​, క్రిష్ణఘాటి, పూంచ్ సెక్టార్ల నియంత్రణ రేఖ వెంబడి పాక్​ బలగాలు కాల్పులు జరిపాయని.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ఇదీ చూడండి:మజిలీలో 'స్ట్రీట్​ ఆఫ్​ చెన్నై' సంగీత మాయాజాలం

ABOUT THE AUTHOR

...view details