తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ఉగ్రదాడులకు పాకిస్థాన్​ భారీ కుట్ర - Pak terror groups plot for attack in india

Pak terror groups plot for attack in india
భారత్​లో ఉగ్రదాడులకు పాకిస్థాన్​ భారీ కుట్ర

By

Published : Oct 19, 2020, 2:12 PM IST

Updated : Oct 19, 2020, 2:35 PM IST

14:07 October 19

భారత్​లో ఉగ్రదాడులే లక్ష్యంగా పాకిస్థాన్ ఇంటిలిజెన్స్, ఉగ్రమూకల కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాడులకు ప్రణాళిక రచించేందుకు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఐఎస్​ఐ, ఉగ్ర సంస్థల కీలక నేతలు ఈనెల 4,7వ తేదీల్లో రెండు సార్లు సమావేశమైనట్లు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఉగ్రవాద సంస్థల నేతలు సయ్యద్ సలావుద్దీన్, హఫీజ్ సయీద్, అన్ని లాంచ్ ప్యాడ్ల కమాండర్లతో పాటు వివిధ మిలిటెంట్ టాంజిమోస్ ఉన్నట్లు నివేదించాయి.  

శీతాకాలనికి ముందే..

శీతాకాలానికి ముందే భారత్​లో పెద్దఎత్తున ఉగ్రదాడులకు పథకం రూపొందించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇందుకు ఒక్కొక్క దాడికి ఇరవై లక్షల రూపాయలు, వీటితోపాటు పెద్ద ఆపరేషన్ చేయడానికి 30 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు సమాచారం.  

భారీగా ఉగ్రచొరబాటుకు సన్నద్ధం..

దాడుల కోసం భారత్​లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నాలు చేపట్టినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఎల్ఓసి దగ్గరగా ఉన్న లాంచ్ ప్యాడ్​ల ద్వారా చొరబడేలా పన్నాగం పన్నినట్లు గుర్తించాయి. దాదాపు 80 మంది ఉగ్రవాదులను అధ్ముఖ్ఆమ్, దూద్నియల్, తహనందపని లాంచ్ ప్యాడ్​లలో మోహరించగా.. ఎల్ఓసి సమీపంలో ఉన్న కొన్ని లాంచ్ ప్యాడ్‌లలో బోర్డర్ యాక్షన్ టీం చురుకుగా ఉందని భద్రతా సంస్థలు తెలిపాయి.  

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదిక ప్రకారం.. 80 మంది ఉగ్రవాదుల బృందం కెరెన్ సెక్టార్ ఎదురుగా ఉన్న అత్తూకామ్, దుధ్నియాల్ మరియు తహండపాని ప్రాంతాల లాంచ్ ప్యాడ్లలో తలదాచుకున్నట్లు తెలిసింది. నీలం లోయ సమీపంలోని తంగ్ధర్ సెక్టార్​లో జైష్, లష్కర్ ఉగ్రవాదులతో చొరబాటుకు ప్రణాళికలు వేసినట్లు సమాచారం. పూంచ్ ప్రాంతానికి ఎదురుగా సుజియాన్ ప్రాంతంలోని పాక్ గ్రామాలలో జైష్ మరియు అల్ బదర్ ఉగ్ర సంస్థల మూకల కదలికలు ఎక్కువగా ఉండగా.. పాకిస్థాన్​ సైన్యం, బాట్​ దళాల సమక్షంలో చొరబాటుకు ప్రణాళికలు చేసినట్లు సమాచారం. మదర్పూర్, నత్తార్ ప్రాంతాలలో కృష్ణ ఘాటి క్యాంప్ ఎదురుగా 20 మంది ఉగ్రవాదులు చొరబాడే అవకాశం ఉంది. లాంజోట్ ప్రాంతంలో భీంబర్ గలి ఎదురుగా 35 మంది ఉగ్రవాదుల బృందం చొరబాటు సిద్ధంగా ఉన్నాయి.  కొన్ని ప్రదేశాలలో స్టాండ్ ఆఫ్ ఫైర్ నిర్వహించాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. దక్ ఖానా ప్రాంతంలో రాజౌరి ఎదురుగా 25 మంది ఉగ్రవాదుల చొరబాటుకు యత్నించే అవకాశం ఉంది. ఇందుకోసం బాట్​ దళాన్ని యాక్టివేట్ చేసింది పాకిస్థాన్. హిండి వద్ద నౌషేరా క్యాంప్  ఎదురుగా ఉన్న 35 మంది ఉగ్రవాదుల బృందం చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Last Updated : Oct 19, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details