పాకిస్థాన్ నుంచి భారత్కు బయలుదేరిన సంఝౌతా ఎక్స్ప్రెస్ వాఘా సరిహద్దు వద్ద నిలిపివేయగా భారత రైల్వే సిబ్బంది అత్తారీ నుంచి ఇంజిన్తో వెళ్లి తీసుకొచ్చారు. అంతకుముందు భద్రతా కారణాలతో సంఝౌతా సేవలను నిలిపివేస్తున్నామని దాయాది పాక్ ప్రకటించింది.
ఈ రైల్లో పాక్ నుంచి 110 మంది ప్రయాణికులు భారత్కు వచ్చారు. అంతకుముందు సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నామని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ప్రకటించారు. కానీ భారత అధికారులు మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన చేశారు. సంఝౌతా పరుగులు ఆగవని వెల్లడించారు.
"సంఝౌతా రైలు సేవలు ఆగిపోలేదు. నడుస్తుంది. సంఝౌతా ఎక్స్ప్రెస్ సిబ్బంది భద్రతకు సంబంధించిన అంశాలను పాక్ అధికారులు లేవనెత్తుతున్నారు. భారత వైపు నుంచి పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించాం. మన ఇంజిన్ మన సిబ్బందితో అత్తారీ వరకు ప్రయాణిస్తుంది."
-దీపక్ కుమార్, ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి