సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణను మరోసారి ఉల్లఘించింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, కతువా జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సేనలు కాల్పులకు తెగబడ్డాయి. అయితే భారత సైనిక బలగాలు దీటుగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు.
మరోసారి పాక్ వక్రబుద్ధి.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు
సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లఘించి పాక్ వక్రబుద్ధి చాటింది. దాయాది జవాన్ల కాల్పులకు దీటుగా బదులిచ్చాయి భారత దళాలు.
పాక్ వక్రబుద్ధి.. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులు
శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించగా.. మళ్లీ ఈ రోజు ఉదయం పూంచ్ జిల్లా మెంధార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ దళాలు కాల్పులు మొదలు పెట్టాయి. పాక్ రేంజర్స్ రాత్రిపూట హిరానగర్ సెక్టార్లోని వివిధ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రేపు ఉదయం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం