తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుర్నీతి.. భారత సైన్యాధికారి వీరమరణం - latest pak firing news

కశ్మీర్​లోని ​ నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలే లక్ష్యంగా పాక్​ దాడులకు పాల్పడుతోంది. దాయాది దుశ్చర్యలకు భారత భద్రతాదళాలు దీటుగా స్పందించాయి. పాక్ కాల్పుల్లో ఓ భారత సైన్యాధికారి సహా ఓ మహిళ మృతి చెందింది.

jk
మరోసారి పాక్​ దుర్నీతి.. భారత సైన్యాధికారి వీరమరణం

By

Published : Dec 25, 2019, 9:45 PM IST

Updated : Dec 25, 2019, 9:59 PM IST

పాక్​ సైన్యం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి రాంపుర్​ సెక్టార్​లో పాక్​ జవాన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ భారత సైన్యాధికారి సహా ఓ మహిళ మృతి చెందింది.

దీటుగా సమాధానం

పాక్​ సైన్యం దుశ్చర్యను భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. ఉరి గ్రామంలోని హజిపీర్​ ప్రాంతంలో ఉదయం 11.30 గంటల సమయంలో పాక్​ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ సరిహద్దు

కథువా జిల్లాలో మంగళవారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు వద్ద గ్రామాలే లక్ష్యంగా పాక్​ కాల్పులకు తెగబడింది. ఈ దాడులకు భారత్​ సైన్యం దీటుగా సమాధానం ఇచ్చింది. హిరానగర్​ సెక్టార్​లోని చంద్వా బెల్ట్​ ప్రాంతంలో పాక్​ కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : మరోసారి పాక్​ దుర్నీతి.. కాల్పుల్లో మహిళ మృతి

Last Updated : Dec 25, 2019, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details