పాక్ ఆగడాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నియంత్రణ రేఖ వెంట విచక్షణారహితంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లా స్వాజియన్ సెక్టార్లో పౌరులను లక్ష్యంగా చేసుకొని 120 ఎంఎం మోర్టార్లు, భారీ ఆయుధాలతో దాడి చేశారు పాక్ రేంజర్లు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో జరిగిన ఈ దాడిని భారత సైన్యం సమర్థంగా ప్రతిఘటించింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు.
ఆగని పాకిస్థాన్ సైన్యం ఆగడాలు... - జమ్ము
నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం అకృత్యాలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో మోర్టార్లు, ఆయుధాలతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులకు గాయాలయ్యాయి.
ఆగని పాక్ అకృత్యాలు
గత శుక్రవారం దిగ్వార్ సెక్టార్లో పాక్ సైన్యం చేసిన దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఇదీ చూడండి:'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'
Last Updated : Apr 12, 2019, 8:01 PM IST