తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్ కారిడార్​ను పునరుద్ధరించిన పాక్

పాకిస్థాన్​ లోని సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రం దర్బార్ సాహిబ్​ను పునఃప్రారంభించింది పాకిస్థాన్. అయితే పర్యటకులను ​భారత్ అనుమతించని కారణంగా వారెవరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేదు. ఈ మేరకు భారత పవిత్ర స్థలాల ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది.

kartharpur
కర్తార్​పుర్ కారిడార్​ను పునరుద్ధరించిన పాక్

By

Published : Jun 29, 2020, 10:57 PM IST

సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రం దర్బార్ సాహిబ్ గురుద్వారాను పునఃప్రారంభించింది పాకిస్థాన్​. అయితే అక్కడికి యాత్రికులు వెళ్లేందుకు కేంద్రం అనుమతించని నేపథ్యంలో భారత పౌరుడెవరూ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించలేదని భారత పవిత్ర స్థలాల ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పవిత్ర స్థలానికి వెళ్లేందుకు చేసే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మార్చి 16న కరోనా విజృంభణ నేపథ్యంలో నిలిపేసింది భారత్.

"కర్తార్​పుర్ కారిడార్​ను సోమవారం పాక్ పునఃప్రారంభించింది. అయితే భారత్​ నుంచి భక్తులెవరూ అక్కడికి వెళ్లలేదు. భారత్​, పాకిస్థాన్​ నుంచి యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ పర్యటించాల్సి ఉంటుంది. భారత పవిత్ర స్థలాల ట్రస్ట్, పాక్ సిక్​ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు, రక్షణ చర్యలు చేపడతాయి.​"

-ఇమ్రాన్​ఖాన్, భారత పవిత్ర స్థలాల ట్రస్ట్ డిప్యూటీ డైరెక్టర్

కర్తార్​పుర్ కారిడార్​ను పునఃప్రారంభించే అంశమై అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల ముందు కారిడార్​ను తెరుస్తున్నట్లు చెప్పారు.

భారత్ అభ్యంతరం..

అయితే పాక్ ప్రకటనపై భారత్​ భిన్నంగా స్పందించింది. భారత్​తో సత్సంబంధాలను నెలకొల్పేందుకే పాక్ కారిడార్ పునరుద్ధరణ అంశాన్ని ముందుకు తెచ్చిందని.. ఆరోగ్య శాఖ, అవసరమైన ఇతర శాఖలతో సంప్రదించిన అనంతరమే భారత వైఖరి ప్రకటిస్తామని వెల్లడించింది. పాక్ పునరుద్ధరణ నిర్ణయం పైనా ఆశ్చర్యం వ్యక్తం చేసింది భారత్. పాక్​ ప్రతిపాదన మంచితనాన్ని చాటుకునే యత్నమని విమర్శించింది. కర్తార్​పుర్ నడవా ఒప్పందం ప్రకారం ఏడు రోజుల ముందు కారిడార్​ను తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వాలని.. కానీ తక్కువ వ్యవధితో పునఃప్రారంభంపై సమాచారం ఇవ్వడం సరికాదని పేర్కొంది.

గతేడాది నవంబర్​లో..

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా గతేడాది నవంబర్​లో కర్తార్​పుర్ నడవా ప్రారంభమైంది.

సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తన జీవిత చరమాంకాన్ని కర్తార్​పుర్​లోనే గడిపినట్లు భక్తులు విశ్వసిస్తారు. 18ఏళ్ల పాటు గురునానక్ ఈ ప్రాంతంలో జీవించారు. భారత్​లోని అన్ని మతాల ప్రజలకు ఈ చారిత్రక గురుద్వారాను సందర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది.

ఇదీ చూడండి:'కర్తార్​పుర్ నడవా పునరుద్ధరణ పాక్ కపట నాటకమే!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details