కర్తార్పుర్పై రెండోసారి భేటీకి పాక్ ప్రతిపాదన కర్తార్‌పుర్ నడవా నిర్మాణం, ఇతర సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు రెండో సారి భేటీ కావాలని పాకిస్థాన్ ప్రతిపాదించింది. ఈ మేరకు వాఘా సరిహద్దులో సమావేశం కోసం భారత్‌ను పాక్ కోరిందని విదేశాంగ శాఖ తెలిపింది.
"కర్తార్‌పుర్ ముసాయిదాపై చర్చించి నడవా తుదిరూపుపై నిర్ణయం తీసుకునేందుకు రెండో సారి భేటీ కావాలని పాక్ ప్రతిపాదించింది. సాంకేతిక సమస్యలు, సౌకర్యాలు తదితర అంశాలపై చర్చకు 2019 జులై 14న వాఘా వద్ద సమావేశం కావాలని కోరింది. ఇందుకోసం భారత్ తరఫున ప్రతినిధుల బృందంపై స్పష్టత ఇవ్వాలని పాక్ సూచించింది."
-భారత విదేశాంగ శాఖ
2018 నవంబర్‌లో కర్తార్‌పుర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ నుంచి భారత్‌లోని గురుదాస్‌పుర్ డేరా బాబా నానక్‌కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్ 26న గురుదాస్‌పుర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్‌పుర్‌లోని నరోవాల్‌లో పాక్ పధాని ఇమ్రాన్ ఖాన్ పునాది రాయి వేశారు.
ఇదీ చూడండి: 'కర్తార్‌పుర్ కారిడార్‌పై పాకిస్థాన్ కొర్రీలు'