పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ మాఛిల్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ దుశ్చర్యకు ఓ పౌరుడు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దీటుగా స్పందించిన భారత భద్రతాదళాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి.
మరోసారి హద్దు మీరిన పాక్.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి - పాక్ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి, మరో 5గురికి గాయాలు
జమ్ముకశ్మీర్ మాఛిల్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఆ దేశ సైన్యం జరిపిన దాడిలో ఓ వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. భద్రతాదళాలు పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టాయి.

మరోసారి హద్దు మీరిన పాక్.. కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి