తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పుడే భారత్​- పాక్​ చర్చలు సాధ్యం: అమెరికా - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

పాకిస్థాన్​ తన దేశంలోని ఉగ్రవాదుల పని పడితేనే భారత్​తో చర్చలు విజయవంతమయ్యే అవకాశముందని అమెరికా అభిప్రాయపడింది. తిరుగుబాటుదారులకు పాక్​ మద్దతివ్వడం మానుకోవాలని స్పష్టం చేసింది.

Pak must crack down on terrorists for successful dialogue with India: White House
అప్పుడే భారత్​-పాక్​ చర్చలు సాధ్యం: అమెరికా

By

Published : Feb 22, 2020, 10:46 AM IST

Updated : Mar 2, 2020, 4:00 AM IST

కశ్మీర్​ అంశంపై మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అనేకమార్లు ప్రకటించారు. మరి ఇప్పుడు భారత్​ పర్యటనలో భాగంగా ఆయన ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో భారత్​-పాకిస్థాన్​ సంబంధాలపై శ్వేతసౌధం స్పందించింది.

ట్రంప్​ మద్దతున్నప్పటికీ పాకిస్థాన్..​ ఉగ్రవాదుల పని పడితేనే ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతమయ్యే అవకాశముందని పేర్కొంది.

"భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించే దిశగా ట్రంప్​ ప్రోత్సహించే అవకాశముంది. తమ సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు జరుపుకునే విధంగా భారత్​, పాక్​ను ట్రంప్​ ప్రోత్సహించవచ్చు. కానీ ఉగ్రవాదాన్ని పాకిస్థాన్​ అరికట్టినప్పుడే ఎలాంటి చర్చలైనా విజయవంతమవుతాయని మా నమ్మకం. సరిహద్దు వెంబడి ఉన్న తిరుగుబాటుదారులకూ పాక్​ మద్దతివ్వకూడదు. ఆ రోజు కోసం మేము ఎదురుచూస్తున్నాం."

--- శ్వేతసౌధం సీనియర్​ అధికారి

అఫ్గానిస్థాన్​ శాంతి చర్చలకు సహకరించమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్రంప్​ అభ్యర్థించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి :-

నమస్తే ట్రంప్​: 'మోటేరా' విశేషాలు ఎన్నో.. మరెన్నో!

Last Updated : Mar 2, 2020, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details