తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2020, 12:01 PM IST

ETV Bharat / bharat

జమ్ము సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరిపిన పాక్

ఆదివారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ పూంఛ్​ జిల్లాలో పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భారత సైన్యం కూడా వారికి దీటుగా స్పందించింది.

jammu
పాక్​ కాల్పులు

నియంత్రణ రేఖ సమీపంలోని జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో.. పాకిస్థాన్ ఆదివారం కాల్పులు జరిపింది. ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

" తెల్లవారుజామున 3.20 గంటలకు పాకిస్థాన్ ఆయుధాలు, మోర్టార్​లు ఉపయోగించి కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ ప్రాంతంలోని మాన్​కోటే సెక్టార్​లో పాక్ ఈ దుర్నీతికి పాల్పడింది. భారత దళాలు దీటుగా స్పందించాయి".

--కల్నల్ దేవేంద్ర ఆనంద్​, రక్షణ శాఖ ప్రతినిధి

ఈ ఏడాదిలో !

1999లో భారత్​-పాక్​ మధ్య జరిగిన సరిహద్దుల్లో కాల్పుల నియంత్రణ ఒప్పందానికి.. దాయాది దేశం తూట్లు పొడుస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్థాన్ దుందుడుకు చర్యలు మరింత పెచ్చరిల్లుతున్నాయి.

ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన 3,190 పాక్​ కాల్పుల చర్యల్లో 24 మంది పౌరులు మృతి చెందగా.. దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు.

పంటలు నాశనం

పాక్​ దుస్సాహస కాల్పుల చర్యకు నియంత్రణ రేఖ సమీపంలో నివసించే వేల మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మేరకు పంటలు కూడా నాశనమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details