తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత్

పాక్ యుద్ధవిమానాల్ని సమర్థంగా తిప్పికొట్టింది భారత్. సరిహద్దు వైపు దూసుకొచ్చిన అత్యాధునిక ఎఫ్​-16లను గుర్తించిన భారత వాయుసేన మిగ్, మిరాజ్​ విమానాల్ని పంపి పాక్​ విమానాల్ని నిలువరించింది.

పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత్

By

Published : Apr 1, 2019, 9:53 PM IST

Updated : Apr 1, 2019, 11:29 PM IST

పాక్ విమానాల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్​కు చెందిన మానవరహిత యుద్ధ విమానాలు సహా నాలుగు ఎఫ్​-16 ఫైటర్ విమానాలు భారత భూభాగం వైపు దూసుకొచ్చాయి. పంజాబ్​లోని ఖేమ్​కరన్​ సెక్టార్​ పరిధిలో పాక్ విమానాల రాకను రాడార్​ సాయంతో గుర్తించింది భారత సైన్యం. సుఖోయ్-30ఎమ్​కేఐ, మిరాజ్-2000 యుద్ధ ​ విమానాల సహాయంతో పాక్ ప్రయత్నాల్ని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ఘటన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొంది భారత సైన్యం.

ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. పాక్ వాయుసేనకు చెందిన ఎఫ్​-16 విమానాన్ని మిగ్-21 సాయంతో కూల్చిన సుమారు నెల అనంతరం ఈ సంఘటన జరిగింది.

అప్పుడూ ఎఫ్​-16 తోనే...

ఫిబ్రవరి 14 సీఆర్​పీఎఫ్ బలగాలపై జైషే మహ్మద్​.. ఆత్మాహుతి దాడి చేసిన తర్వాత అదే నెల 26న బాలాకోట్​లోని ఉగ్రస్థావరంపై వైమానిక దాడి చేసి బదులు తీర్చుకుంది భారత్. ఆ తర్వాతి రోజు పాక్ యుద్ధవిమానాలు భారత్​లోకి దూసుకొచ్చాయి.

తాజాగా ఫిబ్రవరి 27న ఉపయోగించిన విమానాలు 'ఎఫ్-16' యుద్ధవిమానాలేననే సంకేతాలిచ్చిందిపాక్. ఈ విషయాన్నిఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్నిర్ధరించారు.

ఇదీ చూడండి:మసూద్​ అంశంపై డ్రాగన్ కొత్తపలుకులు!

Last Updated : Apr 1, 2019, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details