కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ విరుచుకుపడింది. సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడి.. చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తోందని మండిపడింది విదేశాంగశాఖ. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని భారత్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా.. పాక్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.
దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు, ఉగ్ర కార్యకలపాలాకు సహకారం అందించే విధంగా ఆయుధాల సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు శ్రీవాస్తవ. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్థాన్ సైన్యం సహాయం లేకుండా ఇవి జరగడం అసాధ్యమన్నారు.
ఈ సందర్భంగా ఈ నెల 13న నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులకు పాల్పడిన ఘటనలను గుర్తుచేశారు విదేశాంగ శాఖ ప్రతినిధి. ఈ విషయంపై పాకిస్థాన్ హైకమిషన్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు స్పష్టం చేశారు.