పొరుగు దేశ వాయుసేనతో ప్రతిఘటనలో విమానం కూలి పాక్ సైన్యానికి చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కొద్దిసేపటి క్రితం వాఘా సరిహద్దు వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టారు. భారత్ తొలుత వాయుమార్గం ద్వారా అభినందన్‌ను వెనక్కి పంపాలని పాక్‌ను కోరింది. భారత రక్షణ శాఖ ప్రత్యేక విమానం పంపేందుకు సిద్ధమైంది. అందుకు అంగీకరించలేదు పాక్. అటారీ-వాఘా సరిహద్దు వద్దే అప్పగిస్తామని స్పష్టం చేసింది.
పైలట్‌ను విమానం ఎక్కించని పాక్ - పాకిస్థాన్
అభినందన్! బుధవారం నుంచి మార్మోగుతోంది ఈ పేరు. వాయుసేన పైలట్ విడుదలపై అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో చర్చలు, ఒత్తిళ్లు. చివరకు ఆయన స్వదేశం చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టారు. అభినందన్ ఆ మార్గంలోనే ఎందుకు వచ్చారు? పాక్ నుంచి నేరుగా విమానంలో ఎందుకు రాలేదు?
అభినందన్‌ను విమానంలో పంపేందుకు పాక్ నిరాకరణ
విడుదలకు వ్యతిరేకంగా పిటిషన్...
అభినందన్ విడుదలను వ్యతిరేకిస్తూ పాక్ కోర్టులో ఆ దేశ పౌరుడొకరు వ్యాజ్యం దాఖలు చేశాడు. పాక్‌కు వ్యతిరేకంగా నేరం చేశాడని, దానిపై విచారించాలని కోరాడు. అభినందన్ అక్రమంగా పాక్ గగనతలంలోకి ప్రవేశించాడన్నారు. అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.