తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కవ్వింపులకు సమాధానం..కనుమరుగైన పాక్​ స్థావరం - అఖ్​నూర్

నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్​కు భారత్​ గట్టిగా సమాధానమిచ్చింది. జమ్ము కశ్మీర్ అఖ్​నూర్​ సెక్టార్​లోని పాక్ సైనిక స్థావరాన్ని భారత్ కూల్చేసింది.

ధ్వంసమైన పాక్ స్థావరం

By

Published : Mar 24, 2019, 2:32 PM IST

Updated : Mar 24, 2019, 3:18 PM IST

పాక్​కు భారత్ దీటైన సమాధానం
పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు భారత్​ దీటుగా బదులిచ్చింది. శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​కు గట్టి హెచ్చరికలు పంపింది. జమ్ము కశ్మీర్​ అఖ్​నూర్​ సెక్టార్​లోని పాక్​ స్థావరాన్ని కూల్చేసింది భారత సైన్యం.

దీనికి సంబంధించిన చిత్రాలను భారత సైన్యం విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తలకిందులుగా ఎగరేసిన పాక్ జాతీయ పతాకం కనిపిస్తోంది. పతాకాన్ని సాధారణంగా విపత్కర పరిస్థితుల్లో సహాయార్థం తలకిందులుగా ఎగరేస్తారు.

కొనసాగుతున్న పాక్ ఉల్లంఘనలు

సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్​ పూంచ్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంబడి జరిపిన కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో పాక్​ కాల్పులు:భారత జవాను దుర్మరణం

Last Updated : Mar 24, 2019, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details