తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మారని పాక్ తీరు- సరిహద్దుల్లో జోరుగా డ్రగ్​ దందా - pak smugling in loc

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంటే పాక్​ మాత్రం భారత్​కు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే పనిలో నిమగ్నమైంది. పాక్​ సరిహద్దుల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6 వేల కిలోలకుపైగా డ్రగ్స్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 47 శాతం అధికం.

Pak
పాక్ డ్రగ్ దందా

By

Published : Jun 25, 2020, 9:30 AM IST

ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో చిక్కుకుపోయిన వేళ భారత సరిహద్దుల వెంబడి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పాకిస్థాన్​ ప్రోత్సహిస్తోంది. నిషేధిత మత్తు పదార్థాలతోపాటు ఉగ్రవాద చొరబాట్లకు ఊతమిస్తోంది.

భద్రతా దళాల నివేదిక ప్రకారం.. భారత్, పాక్ సరిహద్దుల్లో హెరాయిన్​, గంజాయి తదితర డ్రగ్స్​ రవాణా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. బీఎస్​ఎఫ్​, పారామిలిటరీ బలగాలు స్వాధీనం చేసుకున్న ఘటనలు కూడా గతేడాది చివరి ఆరు నెలలతో పోలిస్తే 2020 జూన్​ 15 వరకు 47 శాతం అధికంగా నమోదయ్యాయి.

నిషేధిత ఔషధాలూ..

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 200 కిలోల హెరాయిన్​ను బీఎస్​ఎఫ్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల డ్రగ్స్​ కలిపి చూస్తే 6,886 కిలోలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో యాబా మాత్రలతో పాటు నిషేధిత దగ్గు మందు ఫిన్​సెడైల్​ కూడా ఉన్నట్లు సమాచారం. గతేడాది పాక్​, బంగ్లా సరిహద్దుల్లో 11,700 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్​కు సాధారణంగానే భారీ డిమాండ్ ఉంటుంది. భారత్​లో డ్రగ్స్​ స్మగ్లింగ్ ద్వారా ఆర్జించిన సొమ్ముతో పాక్​ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని భారత భద్రత, నిఘా సంస్థల చెబుతున్నాయి.

ఇదీ చూడండి:'భారత్​లోకి చొరబడేందుకు 300లకుపైగా ఉగ్రవాదులు రెడీ'

ABOUT THE AUTHOR

...view details