సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మారోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్... సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం.
పాక్ దుశ్చర్య... సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులు - Pak Army targets forward posts and villages along LoC in J-K's Poonch
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి దాడికి దిగింది. పాక్ దుశ్చర్యకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది.
పాక్ దుశ్చర్య... సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులు
బాలాకోట్, మెందార్ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారత అధికారులు తెలిపింది.
కుప్వారా జిల్లాలోని టాంగ్ధర్ సెక్టార్‌లోనూ ఈరోజు తెల్లవారుజామున.. గ్రామాలే లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Last Updated : Feb 28, 2020, 10:29 PM IST