పాకిస్థాన్ నుంచి వస్తూ భారత గగనతలంలోకి చొరబడ్డ జార్జియాకు చెందిన కార్గో విమానాన్ని భారత వాయుసేన అడ్డుకుంది. బలవంతంగా జైపుర్ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యేలా చేసింది. పైలట్లను భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పాక్ నుంచి భారత్‌లోకి చొరబడ్డ విమానం
భారత గగనతలంలోకి చొరబడ్డ విమానాన్ని వాయుసేన అడ్డుకుంది. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి దిల్లీకి వస్తూ నిర్దేశిత మార్గాన్ని వీడిన జార్జియాకు చెందిన కార్గో విమానాన్ని జైపుర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా చేసింది. పైలట్లను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
దారి తప్పిన విమానం- అడ్డుకున్న వాయుసేన
జార్జియాకు చెందిన ఆంటొనోవ్ ఏఎన్-12 సరుకు రవాణా విమానం కరాచీ నుంచి దిల్లీ వస్తోంది. నిర్దేశిత మార్గాన్ని వీడి ఉత్తర గుజరాత్‌లోని ఓ చోట భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని భారత వాయుసేన గుర్తించింది. వెంటనే జెట్‌ను రంగంలోకి దించి... ఏఎన్-12ను ప్రతిఘటించింది. బలవంతంగా జైపుర్ విమానాశ్రయంలో దిగేలా చేసింది.
ఇదీ చూడండి: మే 23 తర్వాత ఆపరేషన్ కమల 3.0!
Last Updated : May 10, 2019, 9:47 PM IST