తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​వన్నీ అసత్యాలు - కపూర్​

భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ వాయుసేన దాడులకు పాల్పడిందని వెల్లడించారు త్రివిధ దళాధిపతులు.

పాక్​వి అసత్యాలు

By

Published : Feb 28, 2019, 8:52 PM IST

Updated : Feb 28, 2019, 11:57 PM IST

పాక్​వన్నీ అసత్యాలేనని వెల్లడించిన త్రివిధ దళాధిపతులు

పాకిస్థాన్​ అన్నీ అసత్యాలే చెబుతోందని ఆరోపించారు త్రివిధ దళాధిపతులు. దిల్లీ సంయుక్త మీడియా సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ వైమానిక దళం దాడులకు దిగిందని వెల్లడించారు.

పాక్​ యుద్ధవిమానం ఎఫ్​-16ను కూల్చివేశామని, దానికి తగిన ఆధారాలున్నాయని ప్రకటించారు. క్షిపణి శకలాలను మీడియా ముందు బయటపెట్టారు. వింగ్ కమాండర్​ను విడుదల చేయాలని పాక్​ నిర్ణయించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. జెనీవా ఒప్పందానికి కట్టుబడే పాక్​ అలా వ్యవహరించిందని పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో మేజర్​ జనరల్​ సురేంద్ర​ సింగ్​ మహల్​, నేవీ రేర్​ అడ్మైరల్​​ డీఎస్ గుజ్రాల్​, ఎయిర్​వైస్​ మార్షల్​ ఆర్​జీకే. కపూర్​ పాల్గొన్నారు.

''భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ యుద్ధవిమానాలు దాడికి యత్నించాయి. పాకిస్థాన్​ యుద్ధ విమానాలు వేసిన బాంబులు ఆర్మీ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. సైనిక స్థావరాల్లో ఎలాంటి నష్టం జరగలేదు.

పాక్​కు చెందిన ఎఫ్​- 16 ను ఐఏఎఫ్​- మిగ్​ 21 బైసన్ యుద్ధవిమానం​తో కూల్చివేశాం. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వద్ద ధ్వంసమైంది. ఐఏఎఫ్​ ఒక యుద్ధవిమానం మిగ్​-21ను కోల్పోయింది. ఒక పైలట్​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో దిగిపోయారు. ప్రస్తుతం అతను పాక్​ అదుపులో ఉన్నారు.

పాక్​ ఈ మధ్యలో ఎన్నో అసత్య ప్రకటనలు చేస్తూ వచ్చింది. మొదట భారత్​కు చెందిన రెండు యుద్ధవిమానాలు కూల్చి, ముగ్గురు పైలట్లను బంధించామని ప్రకటించింది. అనంతరం మాట మార్చి​ రెండు విమానాలు, ఇద్దరు పైలట్లు అని తెలిపింది. నిజమేంటంటే భారత్​కు చెందిన మిగ్​-21 యుద్ధవిమానాలు కూల్చివేసిన ఎఫ్​-16 విమానాల్లోనుంచి ప్యారాచూట్ల ద్వారా ఇద్దరు పైలట్లు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో దిగారని భారత సైన్యం గుర్తించింది. అనంతరం పాక్​ సాయంత్రం ఒక్క పైలటే తమ అదుపులో ఉన్నట్లు ప్రకటన సవరించుకుంది.''

- ఎయిర్​ వైస్​ మార్షల్​ ఆర్జీకే. కపూర్​

పాకిస్థాన్​ రెచ్చగొట్టే చర్యలను సమర్థంగా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మేజర్​ జనరల్​ సురేంద్ర​ సింగ్​ మహల్​. పాక్​ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని గుర్తుచేశారు.

ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత బలగాలు చేసిన దాడికి స్పందనగా పాకిస్థాన్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. ఫిబ్రవరి 26న ​ సుందర్​బనీ, వింబర్గలి, నౌషేరా, కృష్ణఘాటీ సెక్టార్లలోకి ప్రవేశించింది. దానిని భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టింది. ఫిబ్రవరి 27న మళ్లీ భారత సైనిక స్థావరాలను పాక్​ లక్ష్యంగా చేసుకుంది. ఐఏఎఫ్​ అప్రమత్తతతో పాక్​ వైమానిక దళ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాక్​ రెచ్చగొట్టే చర్యలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సరిహద్దులో శాంతి, సుస్థిరతకై భారత సైన్యం కట్టుబడి ఉంది.

- సురేంద్ర సింగ్​ మహల్​, మేజర్​ జనరల్​

Last Updated : Feb 28, 2019, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details