జపాన్ ప్రధాని షింజో అబే ఆరోగ్య పరిస్థితి బాధ కలిగించిందని భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అబే కృషి చేశారని చెప్పారు. ఆయన బలమైన, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు.
"మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని బాధపడ్డా. కొన్నేళ్లుగా మీ బలమైన నాయకత్వం, వ్యక్తిగత నిబద్ధతతో భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా."