తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు తెరుచుకోనున్న పద్మనాభస్వామి ఆలయం - పద్మనాభస్వామి ఆలయం ఆన్​​లైన్​ టిక్కెట్లు

బుధవారం నుంచి అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. రోజులో గరిష్ఠంగా 665 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు.

Padmanabhaswamy Temple opens today
నేడు తెరుచుకోనున్నపద్మనాభస్వామి ఆలయం

By

Published : Aug 26, 2020, 7:20 AM IST

Updated : Aug 26, 2020, 7:56 AM IST

ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయాన్ని బుధవారం నుంచి భక్తుల సందర్శన కోసం తెరవనున్నారు. కొవిడ్‌-19 కారణంగా మార్చి 21 నుంచి ఆలయ సందర్శనను నిలిపివేశారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకునేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

దర్శనం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ఆలయ వెబ్‌సైట్‌ www.spst.in లో బుక్‌ చేసుకోవాలని సూచించారు. రోజులో గరిష్ఠంగా 665 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండిషెడ్యూల్​ ప్రకారమే పరీక్షలు- శరవేగంగా ఏర్పాట్లు

Last Updated : Aug 26, 2020, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details