తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భక్తుల కోసం తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం - పద్మనాభస్వామి

కరోనా కారణంగా మూసివేసిన అనంత ప‌ద్మనాభ‌స్వామి ఆల‌యాన్ని తెరిచారు. నేటి నుంచి రోజూ ఉద‌యం 8 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి దీపారాధ‌న వ‌ర‌కు ఆల‌యాన్ని తెరిచి ఉంచ‌నున్నట్లు చెప్పారు.

Padmanabhaswamy temple opens for devotees
భక్తుల కోసం తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం

By

Published : Aug 26, 2020, 12:16 PM IST

కేరళ తిరువ‌నంత‌పురంలో లాక్‌డౌన్‌ వల్ల మూసివేసిన అనంత ప‌ద్మనాభ‌స్వామి ఆల‌యాన్ని ఇవాళ భ‌క్తుల కోసం తెరిచారు. నేటి నుంచి స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజూ ఉద‌యం 8 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సాయంత్రం 5 నుంచి దీపారాధ‌న వ‌ర‌కు ఆల‌యాన్ని తెరిచి ఉంచ‌నున్ననట్లు చెప్పారు.

భక్తుల కోసం తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం
భక్తుల కోసం తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం

భక్తులు ఆలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకోవచ్చని అధికారులు చెప్పారు. కరోనా విస్తృతి నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల మార్చి నెల‌లో ఈ ఆల‌యాన్ని మూసివేశారు.

భక్తుల కోసం తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం
భక్తుల కోసం తెరుచుకున్న పద్మనాభస్వామి ఆలయం

ఇదీ చూడండి: 'మహిళల వివాహ వయసు పెంచితే కీడే ఎక్కువ'

ABOUT THE AUTHOR

...view details