ఎన్నో దశాబ్దాలుగా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ వెల్లడించారు.
1930లో హరియాణాలోని హిసార్ జిల్లాలో జన్మించిన జస్రాజ్ గాయకుడిగా, సంగీత గురువుగా, తబాలా వాద్య కారుడిగా విశేష ఖ్యాతి గడించారు. జస్రాజ్ పాడిన శాస్త్రీయ, సెమీ క్లాసికల్ గీతాలు విశేష ప్రజాదరణ పొందాయి. ఆయన ఆల్బమ్‌లు, సినీ గీతాలు ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులను ఓలలాడించాయి. భారత్, అమెరికా, కెనడాలో ఆయన అనేక మందికి సంగీతాన్ని నేర్పించారు.
అవార్డ్లు...