కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి నేతృత్వంలో శుక్రవారం పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చించిన పీఏసీ సభ్యులు.. 2017 కాగ్ నివేదిక ఆధారంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
2017లో కాగ్ 5వ నివేదిక ఆధారంగా భారత్ చైనా సరిహద్దు రహదారులపై ఆడిట్ నిర్వహించేందుకు పీఏసీ నిర్ణయించింది. సియాచిన్, లద్దాఖ్ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు దుస్తులు, పరికరాలు, రేషన్, ఇళ్లు వంటి సౌకర్యాలు కల్పనపై సమీక్ష నిర్వహణకు అంగీకరించింది. ఈ విషయమై రక్షణ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను వివరణ కోరే అవకాశం ఉంది.
పీఎం కేర్స్పై..