తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాలు, సైకిల్​, పొయ్యి- కాదేదీ చందాకు అనర్హం - లోక్​సభ ఎన్నికలు 2019

పార్టీ నిధులు సేకరించటంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ఆమ్​ ఆద్మీ పార్టీ తీరు మరీ భిన్నం. ఈసారి కూడా విరాళాల సేకరణలో పార్టీ నాయకులు ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

పాలు, సైకిల్​, పొయ్యి- కాదేదీ చందాకు అనర్హం

By

Published : Mar 28, 2019, 1:04 PM IST

పాలు, సైకిల్​, పొయ్యి- కాదేదీ చందాకు అనర్హం

ఒక నాయకుడు పాలు, సైకిల్​, గ్యాస్​, పొయ్యి, దుప్పట్లు ఇవ్వమని మిమ్మల్ని అడుగుతుంటే విభిన్నంగా ఉంటుంది కదా. వాళ్లు సేకరించేది పార్టీ నిధుల కోసమైతే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేశంలో ఇలా జరగదు అనుకుంటున్నారా? దిల్లీలో ఆమ్​ ఆద్మీ పార్టీ ఇదే చేస్తోంది.

లోక్​సభ బరిలో దిగిన ఆప్​ సభ్యులు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. డబ్బులు మాత్రమే కాకుండా ప్రజలు ఏమిచ్చినా తీసుకుంటున్నారు.

ఎక్కడికి వెళ్లినా ప్రజలను... ఓటు మాత్రమే కాదు, చందా కూడా కావాలని అడుగుతాం. విరాళం ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటాం. రూ.2000 కంటే తక్కువ మొత్తం అయితే నగదు తీసుకుంటాం. ఇంతకంటే ఎక్కువైతే చెక్ స్వీకరిస్తాం. డబ్బులు మాత్రమే కాకుండా అన్ని రకాల వస్తువులు తీసుకుంటాం. పాత ఫోన్​, సైకిల్​, బైక్​, మంచం​, దుప్పటి... ఇలా ఏ వస్తువునైనా స్వీకరిస్తాం.

వాళ్లు ఇచ్చే రూ.100 రూపాయలు డబ్బులు మాత్రమే కాదు. వారి నమ్మకం.పార్టీ కార్యాలయంలో ఛాయ్​ కావాలి. పాల వ్యాపారం ఉన్న స్నేహితుడు పాలు ఇస్తారు. ఇలా రోజూ పాలు ఆఫీసుకు వస్తాయి. ఒక స్నేహితుడికి బిస్కెట్​ వ్యాపారం ఉందనుకోండి. డబ్బులు లేనప్పుడు బిస్కెట్లు అందిస్తారు. పాలు, బిస్కెట్లు, టీపొడి ఈ విధంగానే సమకూరుతాయి. ఇలా చేసిన ఛాయ్​ను ప్రజలు తాగొచ్చు. ప్రజల సరుకులు, ప్రజల ద్వారా, ప్రజలకే అందిస్తున్నాం.
- దిలీప్ పాండే, ఈశాన్య దిల్లీ ఆప్​ అభ్యర్థి

తూర్పు దిల్లీ నుంచి పోటీ చేస్తున్న అతిశీ ఇదే పద్ధతిలో విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు మొత్తం రూ.40 లక్షల రూపాయలు పోగుచేశారు. కళాశాల పూర్వ విద్యార్థుల నుంచీ నిధులు కోరుతున్నారు. దక్షిణ దిల్లీ నుంచి పోటీ చేస్తున్న రాఘవ్​ చద్దా తాను చదివిన పాఠశాల పూర్వ విద్యార్థుల నుంచి సహాయం పొందనున్నారు.

ABOUT THE AUTHOR

...view details