సిక్కింలో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. నేడు సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్ తమాంగ్ అలియాస్ పీఎస్ గోలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గాంగ్టక్లోని పాల్జర్ మైదానంలో గవర్నర్ గంగా ప్రసాద్ సమక్షంలో పదవిని స్వీకరించనున్నారు గోలే. ఆయనతో పాటుగా కొంత మంది మంత్రులు ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.
తాజా ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపుతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఎస్కేఎం పార్టీ. అయితే పార్టీ అధ్యక్షుడు గోలే 2016లో అవినీతి కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవించిన కారణంగా గవర్నర్ న్యాయసలహాను కోరారు. న్యాయ నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలిపిన అనంతరం గోలేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు.