తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం పిటిషన్ల​పై సుప్రీం విచారణ నేడే..! - కోర్టు

దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ల​పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చిదంబరాన్ని నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

చిదంబరం పిటిషన్ల​పై సుప్రీం విచారణ నేడే..!

By

Published : Aug 23, 2019, 5:15 AM IST

Updated : Sep 27, 2019, 11:00 PM IST

చిదంబరం పిటిషన్ల​పై సుప్రీం విచారణ నేడే..!

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ల​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో చిదంబరం పేర్కొన్నారు. జస్టిస్‌ భానుమతి, జస్టిస్​ ఏ ఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లను విచారించనుంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అంతకుముందే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఆయనను సీబీఐ కోర్టు ముందు నిన్న హాజరు పరిచారు. నాలుగు రోజుల సీబీఐ కస్టడీకికోర్టు అనుమతించింది. ఈ నెల 26 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.

Last Updated : Sep 27, 2019, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details