తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ముందుగా కొవిషీల్డ్​ టీకానే వస్తుందా? - covid vaccine latest news

'కొవిషీల్డ్​' టీకాకు అత్యవసర అనుమతికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో భారత్​.. యూకే అనుమతి కోసం వేచి చూస్తోంది. డీసీజీఐ తీసుకునే తదుపరి చర్యలకు ప్రస్తుతం బ్రిటన్​ అంగీకారం తప్పనిసరి కానుంది.

Oxford COVID-19 vaccine may become the first to get Indian regulator's nod for emergency use
భారత్​లో కొవిషీల్డ్​ వ్యాక్సినే మొదటిదా..!

By

Published : Dec 26, 2020, 8:37 PM IST

భారత్​, యూకేలు సంయుక్తంగా తయారు చేస్తోన్న కొవిడ్​ టీకా 'కొవిషీల్డ్'​కు వచ్చే వారంలో అత్యవసర వినియోగ అనుమతులు రానున్నాయి. జనవరిలో వ్యాక్సిన్​ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) బ్రిటన్​ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

యూకే అంగీకరిస్తే టీకాపై తీసుకొనే తదుపరి చర్యల గురించి భారత్​లోని నిపుణుల కమిటీ సమావేశం కానుంది. వ్యాక్సిన్​ సమర్థత, క్లినికల్​ ట్రయల్స్​ గురించి చర్చించనుంది.

కొవిషీల్డే మొదటిదా?

భారత్​ బయోటెక్​ తయారు చేస్తున్న​ 'కొవాగ్జిన్​' టీకా తుది దశ క్లినికల్​ ప్రయోగాలు పూర్తి కానందున అత్యవసర వినియోగ అనుమతికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. మరోవైపు ఫైజర్​కు అత్యవసర వినియోగం ఆమోదం రాలేదు. దీంతో కొవిషీల్డ్ టీకాయే భారత్​లో ముందుగా వినియోగంలోకి వచ్చే అవకాశముంది.

దేశం​లో తయారవుతోన్న టీకాలకు అత్యవసర ఆమోదం తెలుపాల్సిందిగా.. భారత్​ బయోటెక్​, సీరం ఇనిస్టిట్యూట్​, ఫైజర్​ సంస్థలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన నిపుణుల కమిటీ.. టీకా అదనపు రక్షణ, సమర్థత తదితర అంశాలపై మరింత సమాచారం కావాలని డిసెంబర్ 9నాటి సమావేశంలో కోరింది. అందుకు మరికొంత సమయం కావాలని ఫైజర్​ సంస్థ కోరడంతో, దాని దరఖాస్తును లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఫైజర్​ టీకాకు ఇప్పటికే యూకే, అమెరికా​, బహ్రెయిన్​లు ఆమోదం తెలిపాయి.

సీరం ఇనిస్టిట్యూట్​ దరఖాస్తును పరిశీలించిన కమిటీ.. రెండు, మూడు దశల్లో టీకా సమర్థత, రక్షణ తదితర అంశాలపై సమాచారాన్ని కోరింది. యూకేలోనూ దాని ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాలను యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్​కేర్​ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీని అడిగింది.

ఇదీ చదవండి:'కొవిషీల్డ్‌'కు ముందుగా మనదేశంలోనే అనుమతి!

ABOUT THE AUTHOR

...view details