అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ బిహార్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఖాతా తెరిచింది. అనూహ్యంగా పెద్ద పార్టీలకు షాకిస్తూ కిషన్‌గంజ్ స్థానం నుంచి ఘనవిజయం సాధించింది. భాజపా అభ్యర్ధి స్వీటీ సింగ్‌పై ఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హోడా 10 వేల 204 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టింది తెలంగాణకు చెందిన పార్టీ.
బిహార్‌లో ఖాతా తెరిచిన అసదుద్దీన్ పార్టీ - బిహార్‌లో ఖాతా తెరిచిన అసదుద్దీన్ పార్టీ
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీ బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఉత్తరభారతంలో తొలిసారి విజయం సాధించింది. తెలంగాణకు మాత్రమే పరిమితమన్న గీతల్ని చెరిపేస్తూ అక్కడి ఉపఎన్నికల్లో కిషన్‌గంజ్ స్థానం నుంచి జయభేరి మోగించింది.
బిహార్‌లో ఖాతా తెరిచిన అసదుద్దీన్ పార్టీ
ఈ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులతో సహా మొత్తం 8 మంది పోటీ పడ్డారు. ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థికి మొత్తం 70,469 ఓట్లు రాగా 10,204 ఓట్ల మెజార్టీతో అధికార భాజపా అభ్యర్ధి స్వీటీ సింగ్‌ను ఓడించారు. భాజపాకు 60,265 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు.
ఇదీ చూడండి:లైవ్ : మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలు
Last Updated : Oct 24, 2019, 9:49 PM IST
TAGGED:
Owaisis party in bihar