తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మా పోరాటం 5 ఎకరాల భూమి కోసం కాదు: ఓవైసీ - అయోధ్య తీర్పుపై ఓవైసీ స్పందన

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. తాము పోరాడింది.. 5 ఎకరాల కోసం కాదని.. చట్ట ప్రకారం జరగాల్సిన న్యాయం కోసమన్నారు. తీర్పును 'నిజాలపై నమ్మకాల గెలుపు'గా అభివర్ణించారు.

'అయోధ్య తీర్పు.. నిజాలపై నమ్మకాల గెలుపు'

By

Published : Nov 9, 2019, 3:44 PM IST

Updated : Nov 9, 2019, 7:26 PM IST

అయోధ్య కేసులో చట్ట ప్రకారం తమకు జరగాల్సిన న్యాయం కోసమే పోరాడామని.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ స్పష్టం చేశారు. 5 ఎకరాల భూమి కోసం కాదన్నారు.

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు అనంతరం హైదరాబాద్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఓవైసీ. న్యాయస్థానం నిర్ణయంపై సంతృప్తిగా లేమని చెప్పారు.

అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత

"ఈ రోజు ఇచ్చిన తీర్పు.. నిజాలపై నమ్మకాల గెలుపు. సుప్రీం కోర్టు తీర్పు అంతిమమే.. కానీ అమోఘమేమీ కాదు. ముస్లిం లా బోర్డు సరిగ్గా చెప్పింది. మేం ఈ తీర్పుపై సంతృప్తిగా లేము."

-అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత

ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

Last Updated : Nov 9, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details