దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్ల వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరూ వైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇది అంత శ్రేయస్కరం కాదని కేంద్రం వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
శానిటైజర్లు వాడితే ముప్పు తప్పదు - Coronavirus sanitizers
కరోనా విజృంభించిన నాటినుంచి శానిటైజర్ల వినియోగం భాగా పెరిగింది. అయితే వీటిని వాడటం అంత శ్రేయస్కరం కాదని కేంద్రం వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దాని బదులు వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు.
శానిటైజర్లు వాడితే ముప్పు తప్పదు!
ఈ విపత్తు వేళ శానిటైజర్‌ను ఎక్కువ వాడడం అంత మంచిది కాదని వైద్యారోగ్యశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ అన్నారు. దాని బదులు వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. మాస్కు ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. వేడి నీటిని తరచూ తాగాలని సూచించారు. శానిటైజర్లు అధికంగా వాడడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాను కూడా నశిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.
ఇదీ చూడండి:'మా ఆలోచననే రాహుల్ కాపీ చేసి చెప్పారు'