దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 'ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన' నైపుణ్య కార్యక్రమం ద్వారా 96,196 మంది యోగాలో శిక్షణ పొందారని కేంద్రం తెలిపింది. గత అనుభవం, స్వల్పకాలిక శిక్షణ, ప్రత్యేక ప్రాజెక్టులు వంటి ఇతర నైపుణ్య కార్యక్రమాల ద్వారా.. బోధకులకు, శిక్షకులకు తర్ఫీదునిచ్చింది కేంద్రం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఈ విషయాలను వెల్లడించింది.
శిక్షణ పొందిన వారిలో అధిక సంఖ్యలో.. ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ, బంగాల్ రాష్ట్ర అభ్యర్థులే ఉన్నారని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భవిష్యత్తులో యువతను యోగావైపు మళ్లించేందుకు మరింత కృషి చేస్తున్నట్లు నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
'భారత్.. ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతిగా యోగా అని ప్రధాని అన్నారు. మన ప్రాచీన వేద సంప్రదాయాల్లో ఒకటైన యోగా.. ప్రపంచానికి ఆరోగ్య సూత్రంగా మారింది. ఐదేళ్ల కాలంలోనే యోగా మరింత ఆదరణ పొందింది. '
- మహేంద్ర నాథ్ పాండే, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రి
యోగాలో మూడు రకాలు కోర్సులు ఉంటాయి. అవి: