తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో 8 వేల బంకర్ల నిర్మాణాలు పూర్తి

జమ్ముకశ్మీర్​ సరిహద్దుల్లో భారీ స్థాయిలో రక్షణ పరమైన నిర్మాణాలను పూర్తి చేసింది ప్రభుత్వం. నియంత్రణ రేఖ, జమ్ము అంతర్జాతీయ సరిహద్దుల్లోని 5 జిల్లాల్లో 8 వేలకు పైగా బంకర్లను నిర్మించింది.

బంకర్ల నిర్మాణాలు పూర్తి

By

Published : Oct 6, 2019, 5:10 AM IST

Updated : Oct 6, 2019, 6:21 AM IST

జమ్ముకశ్మీర్​లో 8 వేల బంకర్ల నిర్మాణాలు పూర్తి

సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తోంది ప్రభుత్వం. నియంత్రణ రేఖ, జమ్ము అంతర్జాతీయ సరిహద్దుల్లో 8,600 బంకర్ల నిర్మాణం పూర్తి చేసింది. సరిహద్దుల్లోని మొత్తం 5 జిల్లాల్లో ఈ నిర్మాణాలను చేపట్టింది.

పూంచ్​ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి అత్యధికంగా 4,431 బంకర్లను నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. రాజౌరీ జిల్లాలో 1,238 బంకర్లను ఏర్పాటు చేసింది. సాంబా, కథువా, జమ్ములో సుమారు వెయ్యి బంకర్లను నిర్మించింది.

కాల్పుల నుంచి రక్షణగా...

సరిహద్దుల్లో పాక్​ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఫలితంగా స్థానికుల రక్షణార్థం బంకర్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2017 డిసెంబర్​లో 14,460 బంకర్ల నిర్మాణానికి రూ.415 కోట్లను విడుదల చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: జాతీయ యుద్ధ స్మారకంపై స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరు

Last Updated : Oct 6, 2019, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details