తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాగు చట్టాలకు మద్దతుగా అధ్యాపకుల బహిరంగ లేఖ

వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి మద్దతుగా 866 మంది అధ్యాపకులు సంతకాలు చేసి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ చట్టాలు రైతులకు ఎలాంటి నష్టం కలిగించవని నమ్ముతున్నామని పేర్కొన్నారు.

professors open letter
సాగు చట్టాలకు మద్దతుగా లేఖ

By

Published : Jan 1, 2021, 8:35 PM IST

సాగు చట్టాలకు మద్దతుగా వివిధ విద్యాసంస్థలకు చెందిన 866 మంది అధ్యాపకులు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు సంతకాలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాల మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని లేఖలో పేర్కొన్నారు. రైతులకు ఇవి ఎలాంటి నష్టం కలిగించవని విశ్వసిస్తున్నామన్నారు.

కొత్త చట్టాల ద్వారా రైతులు స్వేచ్ఛగా పంట అమ్మకాలను కొనసాగించవచ్చని అన్నారు.

"ఈ మూడు చట్టాలు కనీస మద్దతు ధరపైన ఎలాంటి ప్రభావం చూపవని కేంద్రం ఉద్ఘాటిస్తోంది. మండీలకు పరిమితం కాకుండా స్వేచ్ఛగా నచ్చిన ధరకు పంట అమ్ముకోవచ్చు."

- అధ్యాపకుల లేఖ

రైతుల కృషికి, ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్నామని లేఖలో పేర్కొన్నారు. లేఖపై సంతకాలు చేసిన అధ్యాపకుల్లో దిల్లీ విశ్వవిద్యాలయం, బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం, జేఎన్​యూ వంటి ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు.

ఇదీ చదవండి :దిల్లీ ఆందోళనల్లో మరో రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details