గత నాలుగేళ్లలో రైల్వే ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు దండుకుంటున్న 73 వేల మందికిపైగా ట్రాన్స్జెండర్లను అరెస్టు చేశామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. రోజుకు సుమారు 50 మందిని ఇలా అదుపులోకి తీసుకుంటున్నట్లు ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
2015లో 13 వేల 546 మంది, 2016లో 18 వేల 526 మంది, 2017లో 20 వేల 566 మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2019 జనవరిలో 1,399 మంది ట్రాన్స్ జెండర్లను అరెస్టు చేశారు.