తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో నేడు ఆరో విడత పోలింగ్​

జమ్ముకశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో విడత పోలింగ్ జరగనుంది. 7 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 31 స్థానాలకు 245మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Over 7.48 lakh voters to decide fate of 245 candidates in 6th phase of DDC election in J-K
జమ్ముకశ్మీర్​లో నేడు ఆరో విడత పోలింగ్​

By

Published : Dec 13, 2020, 5:31 AM IST

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు ఆదివారం నాలుగో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 31 స్థానాలకు 245మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 2,071 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 77 సర్పంచ్​ స్థానాలకు కూడా ఆదివారమే పోలింగ్ జరగనుంది. 229 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్​ 22న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ రిపోర్టర్​పై కశ్మీర్​ పోలీసుల దాడి

ABOUT THE AUTHOR

...view details