తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ను ముంచెత్తుతున్న వరదలు

బిహార్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది​ రంగంలోకి దిగి ఇప్పటివరకు 6,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Over 6,800 people evacuated from flood-hit areas of Bihar: NDRF
బిహార్​లో వరదలు... 6800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

By

Published : Jul 28, 2020, 10:34 PM IST

బిహార్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. సహాయక చర్యల కోసం 21 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు 6,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా వరదల కారణంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో బిహార్​ ప్రథమ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. గండక్, బుర్హి గండక్, బాగ్మతి, కమలాబాలన్, అధ్వర, కోషి వంటి అనేక నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని చెప్పారు. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్తర బిహార్​లోని పలు ప్రాంతాల్లో మరి కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరిన్ని బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'మా ఊర్లో కరోనా లేదు.. వెళ్లిపోండి!'

ABOUT THE AUTHOR

...view details