కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డప్పటికీ దాదాపు నాలుగింట మూడొంతుల మంది చిన్నారులకు తమ కుటుంబ సభ్యుల నుంచి విద్యాభ్యాసంలో మద్దతు లభిస్తోందని బుధవారం విడుదలైన వార్షిక విద్యా పరిస్థితి నివేదిక(అసర్)-2020' వెల్లడించింది.
61.8 % మంది చిన్నారుల ఇళ్లలో స్మార్ట్ఫోన్ - వార్షిక విద్యా పరిస్థితి నివేదిక
దేశంలోని నాలుగింట మూడొంతుల మంది చిన్నారులకు తమ కుటుంబ సభ్యుల నుంచి విద్యాభ్యాసంలో మద్దతు లభిస్తోందని అసర్ నివేదిక తెలిపింది. 60 శాతానికి పైగా ఇళ్లలో కనీసం ఒక్క స్మార్ట్ఫోన్ ఉందని వెల్లడించింది. స్మార్ట్ఫోన్ ఉన్న కుటుంబాలకు చెందిన పాఠశాల విద్యార్థుల సంఖ్య 61.8 శాతానికి చేరుకుందని స్పష్టం చేసింది.
61.8 % మంది చిన్నారుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్
పాఠశాల విద్యనభ్యసిస్తున్న బాలల్లో 60 శాతానికి పైగా మంది ఇళ్లలో కనీసం ఒక్క స్మార్ట్ఫోన్ అయినా ఉందని నివేదిక తెలిపింది. స్మార్ట్ఫోన్ ఉన్న కుటుంబాలకు చెందిన పాఠశాల విద్యార్థుల సంఖ్య రెండేళ్ల క్రితం కేవలం 36.5 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది 61.8 శాతానికి చేరుకుందని పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా అన్నింటా ఈ విద్యార్థుల సంఖ్య దాదాపు సమాన స్థాయిలో పెరిగినట్లు అసర్ నివేదిక వెల్లడించింది.