దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. ఆయా రాష్ట్రాల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేరళలో మరో 5,456 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 93వేల 865కి చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,757 కరోనా మరణాలు సంభవించాయి.
- మహారాష్ట్రలో మరో 3,994 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 18లక్షల 88వేల 767కు చేరింది. కరోనా ధాటికి మరో 75 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 48వేల 574కు ఎగబాకింది.
- దిల్లీలో మరో 1,418 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6.14 లక్షలకు పెరిగింది. మరో 37 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 10,219కి పెరిగింది.
- కర్ణాటకలో ఒక్కరోజులోనే 1,222 కరోనా కేసులను గుర్తించారు అధికారులు. దీంతో బాధితుల సంఖ్య 9లక్షల 7వేల 123కు పెరిగింది. కొవిడ్-19 కారణంగా ఇప్పటివరకు అక్కడ 11,989 మంది చనిపోయారు.
- తమిళనాడులో ఒక్కరోజులోనే 1,134 వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8లక్షల 4వేలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 11,954 మంది కరోనాకు బలయ్యారు.
- రాజస్థాన్‌లో శుక్రవారం రోజు 1,076 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కేసుల సంఖ్య 2.97 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,599 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: