తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద శోకం.. 56 లక్షల మందిపై ప్రభావం - ఆ రాష్ట్రంలో 56 లక్షల మందిపై వరద ప్రభావం

అసోం వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వరదల కారణంగా 56 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. సుమారు 2.62 లక్షల హెక్టార్ల పంట పొలాలకు నష్టం వాటిల్లింది.

Over 56 lakh people affected by Assam floods
అసోంలో 56 లక్షల మందిపై వరద ప్రభావం

By

Published : Aug 2, 2020, 4:06 PM IST

అసోంలో బీభత్సం సృష్టించిన వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే 56,89,584 మందిపై వరదలు ప్రభావం చూపాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మే 22న ప్రారంభమైన ఈ వరదల ధాటికి.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 109 మంది ప్రాణాలు కోల్పోయారు.

బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. 621 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 81,678 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

వరదల కారణంగా రాష్ట్రంలో సుమారు 2,62,723 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండి:బిహార్​లో 40 లక్షల మందిపై వరదల ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details