ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది ప్రయాణికులు రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. మొదటి ప్రత్యేక రైలు కొత్త దిల్లీ స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్లోని బిలాస్పుర్కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది.
ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. రానున్న ఏడు రోజులకు ఇప్పటి వరకు రూ.16.15 కోట్ల విలువైన 45,533 బుకింగ్లు (పీఎన్ఆర్లు) అయ్యాయి. ఫలితంగా 82,317 మంది తమ స్వస్థలాలకు చేరుకోనున్నారు.
ప్రత్యేక మార్గదర్శకాలు
యాభై రోజుల విరామం తర్వాత రెగ్యులర్ ప్రయాణికుల రైళ్లు (15 ప్రత్యేక రైళ్లు) మంగళవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. ఈ రైళ్ల ప్రయాణానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని రైల్వేశాఖ ప్రకటించింది.
రైలు ప్రయాణికులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం 90 నిమిషాలు ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఆహారం, మంచినీరు వెంట తెచ్చుకోవాలి. ప్రయాణికులు తమ మొబైల్లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.