గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దాదాపు 300కుపైగా పాకిస్థాన్ ట్విట్టర్ ఖాతాలను గుర్తించినట్టు స్పష్టం చేశారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులకు పాక్ కుట్ర!
18:13 January 24
రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులకు పాక్ కుట్ర!
"ఈ నెల 13 నుంచి 18 మధ్య పాకిస్థాన్‌కు చెందిన 300కుపైగా ట్విట్టర్ ఖాతాలను గుర్తించాం. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నిందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ తరుణంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడం పెద్ద సవాలు. అయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ర్యాలీ సాగుతుంది."
--- దీపేంద్ర పాఠక్, ప్రత్యేక పోలీస్ కమీషనర్
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని గతేడాది నవంబరు నుంచి దిల్లీ సరిహద్దుల్లో ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. దీనిలో భాగంగా టిక్రీ, సింఘు, గాజీపుర్ సరిహద్దుల్లో భారీగా ట్రాక్టర్ ర్యాలీకి తలపెట్టారు.
ట్రాక్టర్ ర్యాలీని ఆపడానికి ప్రయత్నించిన దిల్లీ పోలీసులు.. రైతులతో నాలుగుసార్లు చర్చలు జరిపారు. అయితే చివరికి అనుమతిచ్చారు.