మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ వైపు వెళ్తున్న ఓ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
గ్వాలియర్ జిల్లాలోని దాద్రా నుంచి అహ్మదాబాద్ వైపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న క్రమంలో కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న సమీప గురుద్వారాలోని పలువురు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకువారిని బయటకు తీశారు. అనంతరం కొలారస్ పోలీసులు స్పందించి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో తోడ్పడ్డారు.