కరోనా సోకకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తల్లో మాస్క్ అతిముఖ్యమైనది. బయటకు రావాలంటే మాస్క్ తప్పనిసరి. ఈ నిబంధనను మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం.
మాస్కుల్లేకుండా బయటకొచ్చారు.. అలా బుక్కయ్యారు! - Over 30 booked in Delhi
కరోనా నివారణ చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడం ఎంతో కీలకం. ఇదే కొంతమేర వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తాజాగా.. దిల్లీ ప్రభుత్వం మాస్క్ లేకుండా బయటకొచ్చిన 32 మందిపై చర్యలు తీసుకుంది.
మాస్క్‌లేకుండా బయటకొచ్చారు.. అలా బుక్కయ్యారు!
దిల్లీ సర్కార్ మరో అడుగు ముందుకేసి ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది. అయితే.. మాస్క్ లేకుండా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించినా.. కొందరు నిబంధనల్ని అతిక్రమించారు. ఇందులో భాగంగా శుక్రవారం.. మాస్క్‌లు ధరించకుండా బయటకు వచ్చిన 32 మందిని అరెస్టు చేశారు పోలీసులు.
Last Updated : Apr 10, 2020, 5:48 PM IST