తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రెండేళ్లలో 3 లక్షల 81వేల ఉద్యోగాల సృష్టి'

రెండేళ్లలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 3లక్షల 81వేల ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2017 మార్చి 1 నుంచి 2019 మార్చి1 మధ్యకాలంలో జరిగిన కొత్త నియామకాలను 2019 బడ్జెట్​ ప్రతుల్లో వెల్లడించింది కేంద్రం. అత్యధికంగా రైల్వేశాఖలో 98,999 ఉద్యోగాలను సృష్టించింది ప్రభుత్వం.

'రెండేళ్లలో 3లక్షల 81వేల కొత్త ఉద్యోగాలిచ్చాం'

By

Published : Jul 8, 2019, 5:01 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ ప్రభుత్వంపై అన్ని విపక్ష పార్టీలు ఎక్కు పెట్టిన ప్రధాన విమర్శనాస్త్రం 'నిరుద్యోగం.' ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వంలో 3లక్షల 81వేల కొత్త ఉద్యోగాలు సృష్టించామని ప్రభుత్వం ప్రకటించింది. 2019 బడ్జెట్​ ప్రతుల్లో ఈ అంశానికి సంబంధించిన లెక్కలున్నాయి.

రైల్వేశాఖ టాప్​...

2017 మార్చి 1 వరకు వివిధ శాఖల్లో ఉద్యోగాల సంఖ్య 32 లక్షల 38వేల 397. ఆ సంఖ్య 2019 మార్చి 1 నాటికి 36 లక్షల 19వేల 596కు చేరుకుంది. అంటే 3లక్షల 81వేల 199 కొత్త ఉద్యోగాలను సృష్టించింది కేంద్రం.

రైల్వేశాఖలో అత్యధిక నియామకాలు జరిగాయి. 2017-2019 మధ్య కాలంలో 98 వేల 999 కొత్త పోస్టులకు నియామకాలు జరిగాయి. అదే సమయంలో రక్షణశాఖలో ఉద్యోగాలు 42వేల 370 నుంచి 88వేల 717కు చేరాయి. నీటి వనరులు, నదుల అభివృద్ధి- గంగా ప్రక్షాళన కలిపి 3వేల 981 ఉద్యోగాలు పెరిగాయి.

శాఖల్లో కొత్త ఉద్యోగాల సంఖ్య

శాఖ కొత్త ఉద్యోగాలు
పోలీసు 8000
ప్రత్యక్ష పన్ను 29,935
పరోక్ష పన్ను 53,000
అణుశక్తి 10,000
టెలికాం 2,250
సైన్స్​ అండ్​ టెక్నాలజీ 7,743
గనులు 6,338
అంతరిక్ష విభాగం 2,920
సిబ్బంది, పింఛను 2,056
విదేశాంగ వ్యవహారాలు 1,833
సంస్కృతి 3,647
వ్యవసాయం, రైతు సంక్షేమం 1,835
పౌర విమానయాన రంగం 1,189

ఇదీ చూడండి:- ఆ మూడు పులులు ఎలా చనిపోయాయి?

ABOUT THE AUTHOR

...view details